బాలయ్యా.. ఇలా చేశావేంటయ్యా?
on Mar 10, 2016

బాలకృష్ణ వందో సినిమా దాదాపుగా క్రిష్‌తో ఖాయమైపోయింది. ఒకట్రెండు రోజుల్లో బాలకృష్ణ కాంపౌండ్ నుంచి వందో సినిమాకు సంబంధించిన ఆఫీషియల్ ప్రకటన రానుంది. ఈలోగా ఈ కథ గురించీ, తన పాత్ర గురించీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు బాలకృష్ణ. అంతా బాగానే ఉంది. ఇలాంటి కథ వచ్చినందుకు బాలయ్య.... ఆయనతో సినిమా తీసే అవకాశం దక్కినందుకు క్రిష్ తెగ సంతోష పడిపోతున్నారు. కానీ.. వీళ్లిద్దరి మధ్యలో బుక్కయిపోయింది కృష్ణవంశీనే! ఆయనేదో ఆయన దారిలో రుద్రాక్ష అనే సినిమా తీసుకొందామని ప్రయత్నాలు చేసుకొంటున్న తరణంలో బాలయ్య నుంచి.. పిలుపొచ్చింది. `వందో సినిమా చేసిపెట్టు` అని బాలకృష్ణ స్వయంగా నోరు తెరచి అడిగాడట. బాలయ్య లాంటి స్టార్ హీరో.. పిలిచి వరం ఇస్తే కాదనే వాళ్లు ఉంటారా?? అందుకే క్రిష్ణవంశీ కూడా వెంటనే ప్రొసీడ్ అయిపోయాడు.
తన రుద్రాక్షని పక్కన పెట్టి.. `రైతు` స్ర్కిప్టు పనుల్లో పడిపోయాడు. ఒకట్రెండు సార్లు హిందూ పురం వెళ్లి బాలయ్య కోసం అక్కడే మకాం వేశాడు. కథ కూడా దాదాపుగా ఓకే అయిపోయింది. ఈ దశలో బాలయ్య `సారీ` చెప్పడంతో కృష్ణవంశి పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడట. `నా మానాన నేను పనిచేసుకొంటే.. ఎందుకు పిలవడం, ఇప్పుడెందుకు సారీ చెప్పడం` అంటూ.. తెగ ఇదైపోతున్నాడట. `ఇప్పుడు కాకపోయినా.. ఎప్పుడో ఒకప్పుడు మనం సినిమా చేద్దాం..` అని బాలయ్య కృష్ణవంశీకి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కృష్ణవంశీ మాత్రం.. అందుకు ఒప్పుకోలేదట. వందో సినిమా అంటే.. ఆ ప్రత్యేకత వేరు. 101 వసినిమా చేసినా.. అంత క్రేజ్ ఉండదు. అందుకే కృష్ణవంశీ కూడా.. ఈ ప్రపోజల్ పట్ల సముఖత చూపించలేదట. అలా... కృష్ణవంశీకి ఓ క్రేజీ ప్రాజెక్టు అందినట్టే అంది చేజారిపోయింది.. బ్యాడ్ లక్ అంటే ఇదే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



