సరైనోడు.. ఈ కథ ఎప్పటిదండీ బాబూ..??
on Mar 10, 2016
.jpg)
వెంకటేష్‌తో తులసి చేసింతర్వాత.... దర్శకుడు బోయపాటి శ్రీనుకి కాస్త గ్యాప్ వచ్చింది. ఆ టైమ్‌లో గోపీచంద్‌తో ఓ సినిమా చేయాలని తెగ ప్రయత్నించాడు శీను. ఆ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. అయితే గోపీచంద్‌కి కథ నచ్చక... బోయపాటి సినిమాకి నో చెప్పేశాడు. ఆ కథనే కొన్ని మార్పులు చేర్పులతో... సరైనోడుగా చేసి, బన్నీతో లాగించేస్తున్నాడట బోయపాటి శ్రీను. అంటే.. ఈ కథ ఎప్పటిదో ఆలోచించండి మరి!
ఓ లేడీ ఎమ్మెల్యే... ఆమెకో బాడీ గార్డు.. వాళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ - ఇలా నడుస్తుందట సరైనోడు స్టోరీ. ఈ లైన్ చూస్తుంటే మనకు అంగ రక్షకుడు, బాడీ గార్డ్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఇంచుమించు సరైనోడు కూడా ఇలానే నడుస్తుందట. కథల విషయంలో కొత్తగా ఆలోచించకపోవడమే బెటర్ అని... మన దర్శకులు ఎప్పుడో ఫిక్సయిపోయారు. బోయపాటి శ్రీను కూడా అంతే. టేకింగు, ఫైటింగులపై దృష్టి పెట్టే శ్రీను.. ఎప్పుడూ కొత్త కథ ఎంచుకోలేదు. ఈసారీ పాత చింతకాయ్ పచ్చడి లాంటి కథకు తనదైన శైలిలో తాలింపు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ వంటకం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



