రోజుకి 66 లక్షలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్
on Jun 22, 2017

సినిమాలు ఫ్లాపవుతున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతూ పోతుంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక కుటుంబ కథా చిత్రం చేస్తున్న పవన్ కళ్యాణ్, తన తదుపరి చిత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడని ఫిలిం నగర్ టాక్. ఇప్పుడు ఇంకో కొత్త రూమర్ ఏంటంటే, నిర్మాతలు పవన్ కళ్యాణ్ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అందుకే, మన పవర్ స్టార్ 60 రోజుల కాల్ షీట్స్ ఉన్న పళంగా ఇచ్చాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అయిపోగానే వాస్తవానికి పవన్ కళ్యాణ్ తమిళ దర్శకుడు నీసన్ తో వేదలమ్ రీమేక్ చేయాల్సింది.
కానీ ఇప్పుడు ఆ సినిమాని పక్కకి నెట్టి మైత్రి మూవీస్ వాళ్ళకి డేట్స్ ఇచ్చాడు. ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 40 కోట్లు. అంటే రోజుకి 66 లక్షల పైనే అన్న మాట. ప్రభాస్ బాహుబలి రెండు పార్టులకి కలిపి ఆరు సంవత్సరాలు కష్టపడితే వచ్చింది... పవన్ కళ్యాణ్ కేవలం 60 రోజుల్లో సంపాదిస్తున్నాడు. ఇది కదా పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



