జూన్ లో బాహుబలి రిలీజ్?
on Mar 26, 2015
.jpg)
ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసేలా చేస్తున్న సినిమా బాహుబలి. ఈ సినిమాను మే 15న ప్రేక్షకుల ముందుకు తెస్తామని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. అయితే సినిమా జూన్ తొలివారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. పోస్టు ప్రొడక్షన్ పనులు అనుకున్న రేంజ్ లో సాగకపోవడమే ఇందుకు కారణమని టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఇంకా నెల 15 రోజుల సమయం అయితే వుంది. కానీ ఆ లోగా పనులు పూర్తి అవుతాయా అంటే అనుమానమే అని తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్ లు, కంప్యూటర్ గ్రాఫిక్ పనులు చాలా సమయం తీసుకుంటున్నాయట. అందువల్ల వాయిదా పడే అవకాశాలు ఎక్కువ వున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



