ఈ నెల తెలుగువన్ షార్ట్ ఫిల్మ్ విన్నర్ 'కుడి ఎడమైతే'
on Mar 26, 2015
యువ దర్శకులు, నటీనటులకు ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో ‘తెలుగువన్’ గత కొంతకాలంగా ప్రతి నెలా షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ‘తెలుగువన్’ నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. మంచి క్వాలిటీతో షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి బహుమతులు అందుకున్నారు. ఈ నెలలో.. అంటే ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు ‘తెలుగువన్’ ఇచ్చే బెస్ట్ ప్రైజ్ కోసం ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ‘తెలుగువన్’ పరిశీలనకు వచ్చాయి. వీటిలో 'కుడి ఎడమైతే' అనే షార్ట్ ఫిల్మ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన Seshu MJ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.