అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!
on Jun 22, 2025
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథలాజికల్ ఫిల్మ్ చేయాల్సి ఉండగా.. అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది. దీంతో అట్లీ తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేతులు కలుపుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు తెరపైకి వచ్చింది.
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ 'శక్తిమాన్' మూవీ ప్రకటన వచ్చింది. అయితే అదే ప్రాజెక్ట్ ని రణ్ వీర్ కి బదులుగా బన్నీతో బాసిల్ జోసెఫ్ ప్లాన్ చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తమ హీరోని శక్తిమాన్ రోల్ లో చూడబోతున్నామని సంబరపడ్డారు. అయితే అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ కలిగించే విషయాన్ని తాజాగా జోసెఫ్ చెప్పాడు. అల్లు అర్జున్ తో 'శక్తిమాన్' చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. 'శక్తిమాన్' సినిమా రణ్ వీర్ తోనే ఉంటుందని, అందులో ఎటువంటి మార్పు లేదని పేర్కొన్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
