క్రేజీ సీక్వెల్ కి ముహూర్తం ఖరారు!
on Jun 22, 2025
విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్ నిర్మించిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం 2018 జూన్ 29న విడుదలై యువతను మెప్పించింది. ఈ తరం యూత్ ఎంతగానో ఇష్టపడే సినిమాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ మీమ్స్ గా ఈ సినిమా డైలాగ్స్ తెగ ఉపయోగిస్తుంటారు. అందుకే 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టీం కూడా సీక్వెల్ ఉందంటూ ఊరిస్తూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.
విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కోసం చేతులు కలపబోతున్నారు. స్క్రిప్ట్ పూర్తయినట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా హింట్ ఇచ్చాడు తరుణ్. ఇక ఇప్పుడు అనౌన్స్ మెంట్ డేట్ లాక్ అయినట్లు సమాచారం. ఈ జూన్ 29 కి 'ఈ నగరానికి ఏమైంది' విడుదలై ఏడేళ్లు పూర్తవుతుంది. అందుకే అదే రోజు సీక్వెల్ ను ప్రకటించబోతున్నట్లు వినికిడి. మరి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
