ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెనక నుంచోమని చెప్పడం బాధ కలిగించింది
on Apr 26, 2025
'పెళ్లి'(Pelli)మూవీలో అద్భుతమైన నటనతో పాటు 'రుక్కు రుక్కుమణి సాంగ్' తో ఓవర్ నైట్ స్టార్ నటుడుగా గుర్తింపు పొందారు పృథ్వీ(Babloo Prithiveeraj). ఆ తర్వాత చేసిన పెళ్లిపందిరి, సమరసింహారెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, దేవుళ్ళు, ప్రేయసిరావే' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడుగా మారాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా హిట్ గా నిలిచిన 'యానిమల్' లో విలన్ గా మెప్పించిన పృథ్వీ రీసెంట్ గా నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కీలక పాత్రలో కనిపించాడు.
తాజాగా ఒక పాడ్ కాస్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న పృథ్వీ మాట్లాడుతు 2024 లో రిలీజైన 'ఉత్సవం'(Utsavam)మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వేరే సినిమాల షూటింగ్స్ నుంచి పర్మిషన్ తీసుకొని మరి వెళ్ళాను. ఆ ఫంక్షన్ లో దర్శక నిర్మాతలని పలకరిస్తే పట్టించుకోకపోయే సరికి బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. స్టేజ్ ముందు వరుసలో కూర్చొని ఉంటే వేరే వాళ్ళు వచ్చిన ప్రతి సారి పక్కకి జరగమన్నారు. అలా జరుగుతు జరుగుతు అదే వరుసలో చివరికి వెళ్ళిపోయాను. స్టేజ్ పైకి నటినటులతో పాటు నా పక్కనే కూర్చున్న సాంగ్ రైటర్, మేకప్ ఆర్టిస్ట్ ని పిలిచారు. కానీ నన్ను పిలవలేదు. చివరకి గ్రూప్ ఫోటో కోసం స్టేజ్ పైకి రమ్మంటే వెళ్ళాను. అక్కడ అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే ఆయన్ని పక్కకి తీసుకెళ్లిపోయారు.
ఆ తర్వాత గ్రూప్ ఫొటోలో వెనక్కి వెళ్లి నుంచోమంటే వెనక్కి వెళ్ళాను. నా పక్కనే గిరిబాబు గారు రాగానే ఆయన్ని ముందుకు తీసుకెళ్లి నుంచో బెట్టారు. యానిమల్ తో పెద్ద స్టార్ అయిపోయానని అనుకున్నాను కానీ ఎవరు పట్టించుకోకపోయే సరికి ఎంతగానో బాధపడ్డానని చెప్పుకొచ్చాడు. 1975 లో ఏంజి రామచంద్రన్ హీరోగా తెరకెక్కిన 'నాళై నమ్మదే' చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పృథ్వీ ఇప్పటి వరకు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వంద సినిమాల దాకా చేసాడు. పలు సీరియల్స్ లో కూడా నటించాడు

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
