నాని సంచలన నిర్ణయం.. ఏపీలో పరిస్థితి ఏంటి?
on Apr 26, 2025
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారీ సినిమాలతో పాటు, మీడియం రేంజ్ సినిమాలకు కూడా.. ఏపీలో టికెట్ రేట్ హైక్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు హిట్-3 వంతు వచ్చింది. (Hit 3)
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన మూవీ 'హిట్-3'. మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ కాగా, సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే మూవీ టీమ్.. ఏపీలో టికెట్ ధరల పెంపుకి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.75 పెంచుకోవడానికి అనుమతి లభించినట్లు సమాచారం.
అయితే దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సినిమాకి ఇలా పెంచుకుంటూ పోతే.. థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
