మాహిష్మతి ఊపిరిపీల్చుకో...కోట్లు కొల్లగొట్టావ్
on May 20, 2017

అద్భుత దృశ్య కావ్యంగా జక్కన్న చేతిలో చెక్కిన సుందర చిత్రం బాహుబలి -2 విడుదలకు ముందే కనివిని ఎరుగని రికార్డులను నెలకొల్పి భారతీయ చలన చిత్ర ఖ్యాతి ని జగద్విఖ్యాతం చేసింది. విడుదలైన పదిరోజుల్లోనే వెయ్యికోట్లను అవలీలగా వసూళ్లు చేసి...కేవలం ఇరవై రెండు రోజుల్లో 1500 కోట్లను కొల్లగొట్టిందంటే మన టాలీవుడ్ చిత్రబృందం చేసిన త్యాగాల ఫలితం నేడు మహా వృక్షంగా రికార్డులను తిరగరాసిందని చెప్పడం లో అతిశయోక్తి లేదు.
ఈ సంబరం యావత్తు భారతీయ మహత్తు ను తెలిపేది. ఇది విన్న సామాన్య ప్రేక్షకులు మన సత్తాకు తిరుగులేదని గర్వ పడుతున్నారు . గతంలో ఉన్న రికార్డులను చెరిపి వేసి సరికొత్త ప్రభంజనం సృష్టించడంతో మాహిష్మతి రాజ్యం మట్టిని ముద్దాడుతున్నట్లుగా ఉంది. దేశ నలుమూలల నుండి సాహోరే బాహుబలి అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. శత్రు దేశం లో సైతం బాహుబలికి పట్టాభిషేకం చేస్తున్నారంటే మరిన్ని కోట్లు తన ఖాతాలో వేసుకోవడం తప్పదని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి సినీ జగత్తులో ఒక దృవతారగా నిలిచిపోనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



