102 సంవత్సరాల బాలీవుడ్ హీరోను చూస్తారా ...!
on May 20, 2017

అమితమైన వృద్ధుని పాత్ర చేయాలంటే కాసింత నేర్పరితనం ఉండాలిమరి. ఆ నేర్పరి తనం మన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు చాలానే ఉంది. ఆయన చేస్తున్న సరికొత్త పాత్ర ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తుంది. ఆయన చేస్తున్నది మాములు పాత్ర కాదట.. 102 ఏళ్ళ వృద్ధుని పాత్రట.. ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో వస్తున్న ‘102 నాటౌట్’ సినిమాలో ఆయన ఈ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో తండ్రి పాత్రలో 102 ఏళ్ల వృద్ధుడిగా అమితాబ్ .. 75 ఏళ్లకుమారుడిగా రిషికపూర్ నటిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులుగా కనిపిస్తున్న వీరిద్దరి ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం తండ్రి కొడుకుల మధ్య పెనవేసుకున్న అనురాగాలను సూచిస్తున్నట్లు తెలుస్తుంది. పాతిక ఏళ్ళ క్రింద నటించిన వీరిద్దరు ఈ పాత్రల కోసం చాలా ఉత్సాహం గా ఉన్నారట. చిత్రం విడుదలయితే కానీ వీరి అన్యోనతను చూడలేము.. కొంత కాలం వేచి చూస్తే మన బాలీవుడ్ అగ్ర నటులు '102 నాటౌట్'గా సందడి చేయడం ఖాయమే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



