తెలుగునాట 'అవతార్-2' ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.37 కోట్లు!
on Dec 19, 2022
![]()
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా సంచలనం సృష్టించింది. తెలుగునాట మూడు రోజుల్లోనే రూ.37 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం.
ట్రాండ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.13.65 కోట్ల గ్రాస్ రాబట్టిన 'అవతార్-2'.. రెండో రోజు రూ.10.85 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.12.60 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి వీకెండ్ రూ.37.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అంచనా. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.19.65 కోట్ల గ్రాస్, సీడెడ్ లో రూ.4.75 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో రూ.12.70 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా 'అవతార్-2' మూడు రోజుల్లో దాదాపు 450 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



