పహల్ గామ్ వెళ్లిన తెలుగు అగ్ర నటుడు..పిక్స్ వైరల్
on Apr 28, 2025
'పహల్ గామ్'(Pahalgam)లోని ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి వెళ్లిన టూరిస్టులని ఉగ్రవాదులు దాడి చేసి చంపిన ఘటన భారతీయుల్ని ఎంతగానో కలిచి వేస్తుంది. దెబ్బకి దెబ్బ తీసి ఉగ్రవాదులని తుదిముట్టించాలని ప్రజలతో పాటు సినీ నటులు కోరుతున్నారు. ఇక 'పహల్ గామ్' సంఘటనతో భయపడిన చాలా మంది ముందుగా ప్లాన్ చేసుకున్న కాశ్మీర్(Kashmir)టూర్ ని రద్దు చేసుకుంటున్నారు.
కానీ ప్రముఖ నటుడు 'అతుల్ కులకర్ణి'(Atul Kulkarni)మాత్రం ముంబై(MUmbai)నుంచి కాశ్మీర్ కి విమానంలో ప్రయాణిస్తు 'ఈ ఫ్లైట్ ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకులతో నిండిపోతుంది. కానీ 'పహల్ గామ్' దాడి తర్వాత ఖాళీగా ఉంది. మనం ఈ సీట్లను తిరిగి భర్తీ చేసి ఉగ్రవాదాన్ని ఓడించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు. అనంతరం పహల్ గామ్ కి వెళ్లి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తు 'నేను పహల్ గామ్ వచ్చాను. మీరు కూడా రండి. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కాశ్మీర్ లోని సింధు, జెలుం నదుల్ని సందర్శిద్దాం రండంటు అక్కడ దిగిన ఫోటోలని షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా, అతుల్ కులకర్ణి ధైర్యాన్ని మెచ్చుకుంటు నెటిజన్స్ పోస్ట్ లు చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్(Venkatesh)కెరీర్లో ఉన్న అనేక హిట్ సినిమాల్లో 'జయం మనదేరా' కూడా ఒకటి. ఈ మూవీ ద్వారానే అతుల్ కులకర్ణి తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలామహల్ సెంటర్, పంజా, రామ్, మజిలీ, వైల్డ్ డాగ్ వంటి పలు చిత్రాల్లో ప్రాముఖ్యత గల పాత్రల్లో కనిపించాడు. హిందీలో ఎక్కువ చిత్రాల్లో కనిపించిన అతుల్ తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, తమిళ, ఇంగ్లీష్, మరాఠీ, ఒడియా భాషల్లో కూడా నటించాడు. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి సుమారు వంద సినిమాల దాకా చేసి భారతీయ సినీ ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
