జనవరి 15.. మహేశ్ లాగే అశోక్‌కీ ప్లస్సవుతుందా!
on Jan 14, 2022

ఈ సంక్రాంతికి సందడి చేస్తున్న తెలుగు సినిమాల్లో `హీరో` ఒకటి. `శమంతకమణి`, `దేవదాస్` చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ సినిమాతో గల్లా అశోక్ కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అనే ట్యాగ్స్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ యంగ్ హీరో.. జనవరి 15న తన మొదటి సినిమాతో పలకరించబోతున్నాడు. ప్రచార చిత్రాల్లో ఇంప్రెస్ చేసిన అశోక్.. వెండితెరపై ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. జనవరి 15 మహేశ్ బాబు కెరీర్ లో ఓ మెమరబుల్ డేట్. ఎందుకంటే.. తన కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిన `ఒక్కడు`.. 2003లో సరిగ్గా ఇదే తేదికి జనం ముందు నిలిచింది. మహేశ్ అభిమాన గణాన్ని మరింత పెంచింది. అలాంటి జనవరి 15న ఇప్పుడు మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా మొదటి సినిమా రాబోతుండడం ఆసక్తికరమే. మరి.. మేనమామ మహేశ్ కి అచ్చొచ్చిన తేది.. మేనల్లుడు అశోక్ కి కూడా ప్లస్సవుతుందేమో చూడాలి.
కాగా, `హీరో`లో గల్లా అశోక్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించగా.. జిబ్రాన్ బాణీలు అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



