Home

»

Latest News

'రావ‌ణాసుర‌'తో సెప్టెంబ‌ర్ నెల‌ క‌లిసొచ్చేనా!?

Jan 15, 2022 11:00AM

 

`ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`, `రావ‌ణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`.. ఇలా ఇంట్రెస్టింగ్ లైన‌ప్ తో ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ఫిబ్ర‌వ‌రి 11న `ఖిలాడి`తో, మార్చి 25న `రామారావు ఆన్ డ్యూటీ`తో సంద‌డి చేయ‌నున్న ర‌వితేజ‌.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో `ధ‌మాకా`, `రావణాసుర‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. వీటిలో `ధ‌మాకా`నే ముందుగా తెర‌పైకి రాబోతోంది.

Also read: 'రావ‌ణాసుర‌'కు క్లాప్ కొట్టిన చిరు!

ఇదిలా ఉంటే.. సంక్రాంతి సంద‌ర్భంగా శుక్ర‌వారం (జ‌న‌వ‌రి 14) `రావ‌ణాసుర‌`కు శ్రీ‌కారం చుట్టారు మాస్ మ‌హారాజా. `స్వామి రా రా` ఫేమ్ సుధీర్ వ‌ర్మ రూపొందిస్తున్న ఈ చిత్రంలో లాయ‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు ర‌వితేజ‌. కాగా, ఈ చిత్రాన్ని 2022 సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో ప్ర‌క‌టించారు.

Also read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. సెప్టెంబ‌ర్ మాసం ర‌వితేజ‌కి అచ్చొచ్చిన నెల అనే చెప్పాలి. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం `సిందూరం` (1997) ఇదే నెల‌లో విడుద‌లై మంచి పేరు తీసుకురాగా.. `ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం` (2001) కెరీర్ లో ఫ‌స్ట్ సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఇక 2014 సెప్టెంబ‌ర్ లో వ‌చ్చిన `ప‌వ‌ర్` కూడా హిట్ చిత్రాల లిస్ట్ లో చేరింది. మ‌రి.. `రావ‌ణాసుర‌` రూపంలో మ‌రో సెప్టెంబ‌ర్ హిట్ ని ర‌వితేజ త‌న ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com