"అర్జున్ రెడ్డి" కోసం తమిళ హీరోల పోటీ...
on Aug 30, 2017
"అర్జున్ రెడ్డి" మేనియా మాములుగా లేదు. సినిమా చూసిన యూత్ మొత్తం సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బూతులు ఉన్నాయంటూ.. ఫ్యామిలీతో చూసే సినిమా కాదంటూ పలు విమర్శలు వచ్చినా.. కొంత మందికి నచ్చకపోయినా... ఎక్కువ మందికి నచ్చిన కారణంతో వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. భారీ వసూళ్లను రాబడుతూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా చూసిన సినిమా ప్రముఖులు కూడా "అర్జున్ రెడ్డి"పై పాజిటివ్ కామెంట్లే చేశారు.
ముఖ్యంగా "అర్జున్ రెడ్డి" పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ నటనకైతే వందకి వంద మార్కులు పడిపోయాయి. అంత క్రేజ్ తెచ్చిపెట్టింది ఈసినిమా విజయ్ కి. అయితే ఇక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న "అర్జున్ రెడ్డి" సినిమాపై ఇప్పుడు తమిళ హీరోలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం అక్కడి నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే, తమిళ యువ హీరోలు ఆ రీమేక్ లో తాము చేస్తామంటూ ఎవరికి వారు పోటీ పడుతున్నారట. మరి ఈ రీమేక్ ఛాన్స్ ఏ హీరోకి దక్కుతుందో చూద్దాం.