`అర్జున్ రెడ్డి ` నిర్మాతకు షాక్!!
on Feb 8, 2019
పూర్తిగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ అయినా తనకు నచ్చలేదని చెప్పుకుంటాడా?? ఇప్పుడు అదే జరిగింది మరి. తమిళంలో రూపొందిన `అర్జున్ రెడ్డి` రీమేక్ విషయంలో నిర్మాతలు అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రకటన హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...తమ సినిమా ఫైనల్ కాపీ చూసుకున్నాక ఏమాత్రం నచ్చలేదనీ, అందు వల్ల మళ్లీ సినిమా మొత్తం రీ షూట్ చేయబోతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ద్వారా విక్రమ్ తనయుడు దృవ్ హీరోగా పరిచయం అవుతోన్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ సినిమా అక్కడ వర్మగా రీమేక్ చేసాడు బాల. ఈ సినిమా కోసం ధృవ్ లుక్ పరంగా డిఫరెంట్ తయారయ్యాడు. మేఘా చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్‌గా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండను చూసిన ఆడియన్స్ ధృవ్ ను ఆ పాత్రలో చూడలేకపోతున్నారు. ఇక ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా చూడలేకపోయారు. దీంతో దర్శకుడు బాలతో పాటు సినిమా యూనిట్ మొత్తాన్ని మార్చేయాలని నిర్మాత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్త దర్శకుడు, నటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నిర్మాత. నిజంగా ఇది విక్రమ్ తనయుడికి కోలుకోలేని షాక్ అని చెప్పాలి. ఫస్ట్ సినిమానే ఇలా జరగడం అనేది మాయని మచ్చగానే మిగిలపోతుంది. మరి కొత్త టీమ్ అయినా అర్జున్ రెడ్డిని నిర్మాతకు ,ప్రేక్షకులకు నచ్చేలా తీస్తాడో లేదో చూడాలి మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
