గెలిచేది ఎవరు!
on Jul 17, 2025
అనుష్క(Anushka),రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ ఇద్దరు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ప్రవేశించి తమ అద్భుతమైన నటనతో టాప్ హీరోయిన్ఫ్ గా ఎదిగారు. హీరోలకి దీటుగా తమ కంటు ప్రత్యేకమైన అభిమాన గణాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది. అందుకే బడా నిర్మాతలు ఈ ఇద్దర్ని ప్రధాన పాత్ర చేసుకొని భారీ వ్యయంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలోనే అనుష్క, రష్మిక మధ్య పోటీ ఏర్పడబోతుందనే వార్తలు వస్తున్నాయి.
అనుష్క ప్రధాన పాత్రలో విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్(Krish)దర్శకత్వంలో 'ఘాటీ'(Ghaati)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో 'వేదం' వచ్చి ఉండటం, ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, అనుష్క లుక్ తో 'ఘాటీ' పై అందరిలోను అంచనాలు పెరిగాయి. 'అరుంధతి' లా 'ఘాటీ' బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని అభిమానులు అయితే బలంగానే నమ్ముతున్నారు. ప్రస్తుతం 'విఎఫ్ఎక్స్' పనుల్లో ఉన్న ఈ మూవీ,సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే డేట్ కి రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl friend)కూడా రిలీజ్ కాబోతుందనే చర్చ చాలా జోరుగానే నడుస్తుంది. ఈ మేరకు మేకర్స్ త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారని కూడా అంటున్నారు. పుష్ప 2 , యానిమల్, చావా, కుబేర లతో రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం, అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 'గర్ల్ ఫ్రెండ్' ని నిర్మిస్తుండంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాల ద్వారా ఈ చిత్ర కథపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనుష్క, రష్మిక ఒకేసారి పోటీపడితే ఎవరు పై చేయి సాధిస్తారనే ప్రచారం సినీ సర్కిల్స్ లో జరుగుతుంది.
నాగార్జున(Nagarjuna),పూరి జగన్నాధ్(Puri jagannadh)కాంబోలో 2005 లో వచ్చిన 'సూపర్' మూవీతో అనుష్క సినీ రంగ ప్రవేశం చేయగా, నాగశౌర్య హీరోగా 2018 లో వచ్చిన ఛలో మూవీతో 'రష్మిక' హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
