వచ్చే ఏడాది సినిమా రిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్
on Jul 17, 2025
వరల్డ్ సినిమాలని ఫాలో అయ్యే సినీ ప్రేమికులకి ప్రఖ్యాత దర్శకుడు 'క్రిస్టోఫర్ నోలన్'(Christopher Nolan)సినీ జర్నీ గురించి తెలిసే ఉంటుంది. 1998 లో రిలీజైన 'ఫాలోయింగ్' అనే సినిమాతో దర్శకుడిగా,రచయితగా, నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన క్రిస్టోఫర్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలకి దర్సకత్వం వహించి ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. 2023 లో అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఒప్పెన్ హైమర్'(J. Robert Oppenheimer)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఒప్పెన్ హైమర్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ప్రస్తుతం 'ది ఆడెస్సి'(The Odyssey)అనే చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. ఇతిహాసంతో కూడిన యాక్షన్ ఫాంటసీ గా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది జులై 17 న రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. 'అమెరికా'(America)లోని ఐమాక్స్ 70 mm స్క్రీన్స్ 'ది ఆడెస్సి' టికెట్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు, సంవత్సరం ముందే అడ్వాన్స్ టికెట్స్ ని ప్రారంభించిన సినిమాగా కూడా 'ది ఆడెస్సి' రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు.
ఈ చిత్రంలో హీరోగా 'క్రిస్టోఫర్' నే చేస్తుండగా మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాథవే కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. 250 మిలియన్ డాలర్స్ తో నిర్మాణం జరుపుకుంటుండగా, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
