రాఘవేంద్రరావు కుమారుడితో అనుష్క పెళ్లి?
on Mar 5, 2020

అవును. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ వదంతి ఇది. బాలీవుడ్ మీడియా ఈ వదంతిని జోరుగా ప్రచారంలోకి తీసుకువస్తోంది. నిన్నటి దాకా ప్రభాస్, అనుష్క డేటింగ్ గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చిన విషయం మనకు తెలుసు. అనేకసార్లు ఈ ప్రశ్న ఎదురైనప్పుడు వాటిలో నిజం లేదనీ, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అనీ, తమ మధ్య మరో రకమైన బంధం లేదనీ వాళ్లిద్దరూ చెప్పుకుంటూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు, 'అనగనగా ఓ ధీరుడు', 'సైజ్ జీరో' సినిమాల దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడితో అనుష్క డేటింగ్ చేస్తుందంటూ ఒక వదంతి మొదలైంది. అయితే చాలామంది దాన్ని నమ్మలేదు, సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఇవాళ బాలీవుడ్ మీడియాలో ఈ ప్రచారం ఊపందుకోవడంతో అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
ప్రకాశ్‌కు ఇదివరకే కనికా ధిల్లాన్ అనే స్క్రిప్ట్ రైటర్‌ను పెళ్లాడాడు. ఆమె ప్రకాశ్ డైరెక్ట్ చేసిన 'సైజ్ జీరో', హిందీ మూవీ 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 2014లో పెళ్లాడిన ప్రకాశ్, కనిక మధ్య 'సైజ్ జీరో' తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి, విడివిడిగా ఉండటం మొదలుపెట్టారు. గత ఏడాది విడాకులు సైతం పొందారు. 'సైజ్ జీరో' మూవీ చేస్తున్నప్పట్నుంచే అనుష్క, ప్రకాశ్ మధ్య ఏర్పడిన స్నేహం మరింత బలపడి, ప్రణయంగా మారిందటూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తమ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావించి, ఈ ఏడాది వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లాడాలనుకుంటున్నానని అనుష్క చెప్పింది. మరి అనుష్క, ప్రకాశ్ వివాహ ప్రచారం నిజమవుతుందా, లేక ఒక వదంతి గానే మిగిలిపోతుందా? వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



