అనసూయను 'ఆంటీ' అంటే జైలుకే!
on Aug 26, 2022

నిన్నటి నుంచి నటి, యాంకర్ అనసూయ పేరు ట్విట్టర్ లో మారుమోగిపోతోంది. దానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడం అని చెప్పొచ్చు. భారీ అంచనాలతో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'లైగర్' మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. సరిగ్గా అదే సమయంలో "అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా" అంటూ అనసూయ ట్వీట్ చేసింది. 'అర్జున్ రెడ్డి' సమయంలో విజయ్ తో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకునే అనసూయ ఆ ట్వీట్ చేసిందని అందరికీ అర్థమైంది. దీంతో కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ట్విట్టర్ వేదికగా కొందరు అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తూ.. 'ఆంటీ' అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే ఆమెని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో తనను ట్రోల్ చేసేవాళ్ళని జైల్లో పెట్టిస్తానంటూ అనసూయ ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చింది. తన గురించి తప్పుగా చేసిన ప్రతి ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసి.. పోలీస్ కేసు ఫైల్ చేస్తానని హెచ్చరించింది.
.webp)

అనసూయ పోలీస్ కేస్, జైలు అంటున్నా ట్రోలర్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. మరింత రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆంటీ అని పిలిస్తే తప్పేంటి? పెళ్ళైన వారిని, వరుసకు పిన్ని, అత్త అయ్యేవారిని ఆంటీ అనే పిలుస్తాం కదా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో మరింత ఆగ్రహం తెచ్చుకున్న అనసూయ.. "మీ కుటుంబానికి, మా కుటుంబానికి బంధుత్వం ఉందా?.. పరిచయం లేని వారిని ఆంటీ అని పిలిస్తే ఒక్కటి పీకుతారు." అంటూ బదులిచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన నెటిజన్లు 'ఆంటీ' అంటేనే జైల్లో వేస్తారా అంటూ మీమ్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



