హిందీలో విడుదల కాబోతున్న 'సీతా రామం'
on Aug 26, 2022

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా రామం'. రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూడు వారాల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.35 కోట్ల షేర్ రాబట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రం.. త్వరలో హిందీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
'సీతా రామం'ను హిందీలో పెన్ స్టూడియోస్ విడుదల చేస్తోంది. హిందీ వెర్షన్ సెప్టెంబర్ 2న విడుదల కానుంది. దుల్కర్, మృణాల్, రష్మిక నార్త్ ప్రేక్షకులకు సుపరిచితమే. పైగా కొంతకాలంగా నార్త్ లో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలైన 'కార్తికేయ-2' అక్కడ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో చూస్తున్నాం. కేవలం కంటెంట్, మౌత్ టాక్ తోనే 'కార్తికేయ-2' ఆ స్థాయి ఆదరణ పొందుతోంది. క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్న 'సీతా రామం' కూడా హిందీలో ఆ స్థాయి పొందుతుందేమో చూడాలి.
వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా.. పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరించారు. తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



