సమంతని ఇమిటేట్ చేస్తున్న అషురెడ్డి!
on Dec 29, 2021

సమంత విడాకులతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. విడాకుల పర్వం తరువాత సమంత `పుష్ప`లో ఐటమ్ సాంగ్ తో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రంలోని `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా..' పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఈ పాటలో సమంత హోయలు పోయిన తీరు.. పాటలో చంద్రబోస్ రాసిన పదాలు ఓ రేంజ్ లో ఈ ప్రత్యేక గీతాన్ని హాట్ టాపిక్ గా మార్చాయి.
అయితే ఇదే పాటలో సమంత ఒలికించిన హొయలని ఇమిటేట్ చేస్తోంది అషురెడ్డి. గత కొన్ని వారాలుగా ఓంకార్ కామెడీ స్టార్స్ కి దూరంగా వుంటున్న అషు రెడ్డి తనదైన వీడియోలతో తన యూట్యూబ్ చానల్ ని వైరల్ చేసే పనిలో పడింది. ఇంతకు ముందు తను ప్రెగ్నెంట్ అంటూ ప్రాంక్ వీడియో చేసి తన తల్లి చేతిలో తన్నులు తిన్న అషు రెడ్డి తాజాగా సమంత ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
`పుష్ప`లో సమంత చేసిన సాంగ్ ని అనుకరిస్తూ కవర్ సాంగ్ చేసిన అషురెడ్డి అదే డ్రెస్ ని వేసుకుని హోయలు పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రోమోని తాజాగా విడుదల చేసింది. అషురెడ్డి కవర్ సాంగ్ వీడియో ఓ రేంజ్ లో యూట్యూబ్ లో దుమ్ము లేపేలా కనిపిస్తోందని ఆమె అభిమానులు చెబుతున్నారు. చిట్టి పొట్టి గౌనులో అషు రెడ్డి చేసిన రచ్చ ఎలా వుండబోతోందో తెలియాలంటే ఈ కవర్ సాంగ్ కి సంబంధించిన ఫుల్ వీడియో రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



