వయసైన పాత్రలపై వలపెందుకో....!
on May 21, 2017

ఈ మధ్య కాలం లో బాలీవుడ్ నటులు వృద్దులుగా నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా బాలీవుడ్ అమితాబ్ నూట రెండేళ్ల వయసున్న వృద్ధుని పాత్ర, రిషి కపూర్ డెబ్భై ఐదేళ్ల వయసున్న వృద్ధుని పాత్రలో కనిపిస్తూ కొత్త చిత్రం చేస్తున్నసంగతి తెలిసిందే .. అయితే మరింత తాజాగా తన అందాలతో కనువిందు చేసే కంగనా రనౌత్ ఎనబై ఏళ్ళ వృద్దురాలిగా రాబోతున్నానని ప్రకటించేసింది.
తన స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో రానున్నట్లు తెలిపింది. ఆమె తెరకెక్కించే 'తేజు' అనే చిత్రం లో తన వృద్ధ పాత్రను పోషించనున్నది. దీనిని బట్టి బాలీవుడ్ వయసైన పాత్రలతో సామాజిక కోణం లో సందేశాలను వినిపించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. రాను రాను సమాజంలో వృద్ధుల పట్ల పిల్లలు చూపించే ఉదాసీనత కు కలత చెందిన బాలీవుడ్ దర్శకులు అందరిని ఆలోచింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కంగనా రనౌత్ ‘రంగూన్’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’గా రానున్నది. త్వరలో ‘సిమ్రన్’ చిత్రంతో మురిపించనున్నది. తన స్వీయ దర్శకత్వంలో రానున్న'తేజు ' చిత్రం ద్వారా ఏం సందేశం ఇవ్వనుందో చూడాలిమరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



