వరస చిత్రాలతో జోరు మీదున్న సంగీత దర్శకుడు..!
on May 22, 2017

సినిమా సినిమాకు కొత్త స్వరాలను అందిస్తూ..తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ..అందరినిమెస్మరైజ్ చేసే మాంత్రికుడు దేవి శ్రీ ప్రసాద్ తన వరస చిత్రాలతో జోరు మీదున్నారు.ఆయన సంగీతాన్ని అందిస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా పోటీ పడి రాబోతున్నాయి.తాజాగా ఆయన స్వర పరిచిన 'రారండోయ్ వేడుక చూద్దాం'పాటలు అందరిని అమితం గా ఆకట్టుకుంటున్నాయి.ఇక నేటి నుండి అల్లు అర్జున్ కథానాయకుడిగా వస్తున్న 'డీజే '(దువ్వాడ జగన్నాథమ్)పాటల సందడి మొదలు కానున్నది.ఊపును పెంచే దేవి అభిమానులలో ఉషారును తెప్పించనున్నారు.ఈ చిత్రం కాగానే ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న 'జై లవ కుశ'చిత్రం తో మైమరపించనున్నారు. అంతేకాదు సుకుమార్ దర్శకత్వం లో మెగా హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా రాబోతున్న పేరు ఖరారు కానీ చిత్రానికి తన సంగీతాన్ని అందించనున్నారు.ఇలా భారీ చిత్రాల పాటు విదేశాలలో ప్రదర్శనకు తన బృందంతో సిద్ధమయ్యారు.ఆయన పంచె సంగీత స్వరాల కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు.ఇక ఆయన సందడి మొదలైనట్లే అని టాలీవుడ్ లో టాక్ మొదలైంది. ఎంతైనా ఆయన జోరుకు సలాం చెప్పాల్సిందే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



