ఎవరు వన్ మ్యాన్ షో
on Oct 24, 2025

ఐకాన్ స్టార్ట్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee Kumar)దర్శకత్వంలో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నాడు. సాంకేతిక పరంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులతో పాటుప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ పై పోషించని ఒక సరికొత్త క్యారక్టర్ లో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు.
రీసెంట్ గా అల్లు అర్జున్ ఎక్స్(X)వేదికగా కాంతార చాప్టర్ 1(Kantara chapter 1)గురించి స్పందిస్తు 'కాంతార చూసి ఆశ్చర్యపోయాను. రైటర్, దర్శకుడు, హీరోగా రిషబ్ శెట్టి అన్నిట్లోనూ ది బెస్ట్ ఇచ్చారు. ఇది వన్ మాన్ షో. మూవీలో చేసిన ప్రతి ఒక్కరు వారి క్యారెక్టర్స్ కి వంద శాతం న్యాయం చేశారు. సాంకేతిక నిపుణల అత్యుత్తమ పని తీరు ప్రతి సన్నివేశంలో కనిపించింది. ఇంత గొప్ప సినిమాని నిర్మించినందుకు హోంబులే ఫిలిమ్స్ కి అభినందనలు అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ పై రిషబ్ శెట్టి స్పందిస్తు బన్నీ కి కృతజ్ఞతలు తెలిపాడు.
ఇక కాంతార చాప్టర్ 1 నాలగవ వారంలో కూడా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు సుమారు 818 కోట్ల రూపాయల గ్రాస్ ని సాధించి,ఈ సంవత్సరంలో ఆ ఘనతని సాధించిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1780 కోట్ల రూపాయలు రాబట్టిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



