ట్రెండ్ ఫాలో అవ్వను,సెట్ చేస్తా
on Oct 24, 2025

కిరణ్ అబ్బవరం ఈ నెల 18 న 'కే ర్యాంప్'(K Ramp)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్ళని సాదిస్తు డిస్ట్రిబ్యూటర్స్ ని లాభాల బాటలో పయనించేలా చేస్తుంది. ఇక ఈ చిత్రం ప్రారంభ సన్నివేశంలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)ఇదేమిటమ్మ మాయా మాయా మైకం కమ్మిందా, ఆంధ్ర లోకం నిన్నునన్ను ఏకం కమ్మందా' అనే సాంగ్ ని రీ క్రియేట్ చేస్తు డాన్స్ చేస్తాడు. ఈ సాంగ్ కి కిరణ్ అబ్బవరం వేసిన హుషారైన స్టెప్స్ కి థియేటర్ లో ఒకటే విజువల్స్.
రీసెంట్ గా ఆ సాంగ్ ని చిత్రబృందం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సాంగ్ డాక్టర్ రాజశేఖర్(Rajasekhar),ఎన్ శంకర్ (Shankar)కాంబినేషన్ లో వచ్చిన 'ఆయుధం'(Aayudham)చిత్రంలోనిది. వందేమాతరం సంగీత సారధ్యంలో బాలీవుడ్ అగ్ర గాయకుడు కుమార్ సాను తో కలిసి నిష్మా ఆలపించింది. చిన్ని చరణ్ సాహిత్యాన్ని అందించాడు. రాజశేఖర్ తో గుర్లిన్ చోప్రా(Gurleen Chopra)చిందులేయ్యగా 2003 లో ఆయుధం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కే ర్యాంప్ తో వచ్చిన క్రేజ్ తో ఒరిజినల్ సాంగ్ కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



