వాళ్లను ఉద్దరిస్తానంటున్న సల్మాన్
on Aug 18, 2016
.jpg)
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఏది చేసినా వెరైటినే..హీరోయిన్లతో ఎఫైర్లు నడిపినా, నోటీ దురుసుతో వివాదాలు తెచ్చుకున్నా ఆయనకే చెల్లింది. ఎన్ని చేసినా నలుగురికి సాయం చేయాలంటే మాత్రం అందరికంటే ముందుంటాడు. ఇప్పటికే ఆ విషయం ప్రూవ్ చేసుకున్నాడు కూడా. ఒలింపిక్స్ ఫీవర్‌లో ప్రపంచం తడిసిముద్దవుతున్న వేళ సల్మాన్ సంచలన ప్రకటన చేశాడు. దేశం కోసం ఒలింపిక్స్‌కు వెళ్లిన ఆటగాళ్లను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యాడు. దీనిలో భాగంగా ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.1,01,000 చొప్పున 118 మంది అథ్లెట్లకు ఇవ్వనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. అన్నట్లు చెప్పడం మరచిపోయాం ఇప్పుడు జరుగుతున్న రియో ఒలింపిక్స్‌కు సల్మాన్ గుడ్‌విల్ అంబాసిడర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



