ట్రెండింగ్ లో అల్లు అర్జున్ ' చెప్పను బ్రదర్ '...!
on May 5, 2016

చెప్పను బ్రదర్..ఏ ముహూర్తంలో అల్లు అర్జున్ ఈ మాట అన్నాడో గానీ, పవన్ ఫ్యాన్స్ ఇప్పుడీ డైలాగ్ ను ట్రెండింగ్ గా మార్చేశారు. ట్విటర్లో ఈరోజు ఉదయం నుంచీ టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా చెప్పను బ్రదర్ నడుస్తోంది. విషయంలోకి వెళ్తే, నిన్న విజయవాడలో సరైనోడు టీం అంతా సక్సెస్ ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ విజయోత్సవ సభకు అభిమానులు కూడా భారీగానే హజరయ్యారు. చివర్లో బన్నీ మాట్లాడుతున్నప్పుడు ఎప్పటిలాగే, పవన్ ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తూ, బన్నీని పవన్ గురించి చెప్పమన్నట్టుగా అడిగారు. అప్పటికే స్పీచ్ మధ్యలో ఉన్న బన్నీ, చెప్పను బ్రదర్ అంటూ రెస్పాన్స్ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారిపోయింది. ట్విట్టర్లో చెప్పను బ్రదర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు, కామెడీ మెమేలు ట్రెండ్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ తో మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఇందుల్లో ఓ చెయ్యేస్తున్నారట. బన్నీ తప్పు లేదని కొంత మంది అంటుంటే, తిట్టే వాళ్లు మరికొంతమంది. ప్రతీసారీ పవన్ గురించి మెగా ఫ్యామిలీ మాట్లాడాలా అంటూ అల్లు అర్జున్ అభిమానులంటుంటే, సినిమా హిట్టయ్యేసరికి అతనికి పొగరొచ్చేసిందంటూ పవన్ ఫ్యాన్స్ ఆడిపోసుకుంటున్నారు. ఈ ఒక్క డైలాగ్ దెబ్బకి మెగా ఫ్యాన్స్ రెండు గా చీలిపోయి మాటలు అనుకోవడం విచిత్రం. పవన్ గురించి రెండు ముక్కలు చెప్పేస్తే, బన్నీ సేవ్ అయిపోయేవాడుగా అంటున్నారు న్యూట్రల్ ఫ్యాన్స్. ఏంటో..ఈ అభిమానులు పలు రకాలు...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



