24 సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి..!
on May 5, 2016
రేపు రిలీజ్ కాబోతున్న సూర్య 24 సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమిళనాడులో అయితే వీకెండ్ టికెట్స్ సేల్ అవుట్ అయిపోయాయి. ఈ సినిమాను స్పెషన్ స్క్రీనింగ్ లో క్రిటిక్స్ కు షో వేశారు. ప్రివ్యూ షో చూసిన బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ 24 మూవీ టీం ను పొగడ్తల్లో ముంచేశాడు. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలని, సినిమాపై పట్టు ఉండటమే కాక, ఆర్ధికంగా చాలా కెపాసిటీ ఉండాలి. 2 గంటల 40 నిముషాల పాటు, సీట్లలో కదలకుండా కూర్చోపెట్టగల సినిమా 24 అంటూ సినిమాను ఆకాశానికెత్తేశాడు.
ఊహించలేని ట్విస్టులు, అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్, డ్రమెటిక్ స్టార్ట్, సూర్య సమంతల మధ్య వచ్చే క్యూట్ మూమెంట్స్, ఫెంటాస్టిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ మిమ్మల్ని కట్టిపడేస్తాయి. సినిమాలోని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు మేజర్ అట్రాక్షన్స్ అంటూ తన ట్విట్టర్లో పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో సూర్య 24 సినిమా గురించి ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మనం సినిమాను తెరకెక్కించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో, సూర్య, సమంత, నిత్యామీనన్ నటించిన 24 రేపు తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది. భారతీయ భాషల్లో చాలా అరుదుగా వచ్చే సైఫై జానర్లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
Also Read