
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)స్టైల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ ది స్క్రీన్ ఆయన మెయింటైన్ చేసే లగ్జరీ లైఫ్ స్టైల్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్, అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా కలిశారు. ఈ క్రేజీ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ లుక్ ఎంత స్టైలిష్‌గా ఉందో, ఆయన చేతికి ఉన్న ఒక లగ్జరీ వాచ్ అంతకంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెటిజన్లు ఆ వాచ్ వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టడంతో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వైరల్ ఫోటోలలో అల్లు అర్జున్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ అయిన 'పాటెక్ ఫిలిప్' (Patek Philippe) కంపెనీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నాటిలస్ మూన్‌ఫేస్ రోజ్ గోల్డ్ (Nautilus Moonphase Rose Gold) వాచ్‌ని ధరించాడు. ఈ అల్ట్రా లగ్జరీ టైమ్‌పీస్ ధర వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. వాల్యూ దాదాపు 2.75 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ భారీ మొత్తంతో, హైదరాబాద్ వంటి మహానగరంలో ఒక అద్భుతమైన లగ్జరీ ఫ్లాట్ లేదా గేటెడ్ కమ్యూనిటీ విల్లాను సులభంగా కొనుగోలు చేయవచ్చు.
Also read: sharwanand: శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో చిరు భామ.. ఈ మధ్యనే సూపర్ హిట్ అందుకుంది
క్రికెట్ మరియు సినిమా రంగాల కలయికగా సాగిన ఈ భేటీలో కేవలం వాచ్ మాత్రమే కాకుండా ఒక క్యూట్ మూమెంట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సమావేశంలో వెంకటేష్ అయ్యర్ ఒక స్వీట్ జెస్టర్‌తో అల్లు ఫ్యామిలీని ఖుషీ చేశారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కోసం ప్రత్యేకంగా ఒక ఆర్‌సీబీ (RCB) జెర్సీని కానుకగా అందించారు. ఈ క్రేజీ గిఫ్ట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా వెంకటేష్ అయ్యర్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అల్లు అర్జున్ ప్రెజెంట్ అట్లీ తో చేస్తున్న రాకా(Raaka)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అట్లీ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకోనుంది.




.webp)

