Home

»

Latest News

sharwanand: శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో చిరు భామ.. ఈ మధ్యనే సూపర్ హిట్ అందుకుంది

May 25, 2026 3:28PM

 

 

నారీనారీ నడుమ మురారి, బైకర్ వంటి వరుస విజయంతమైన చిత్రాలతో శర్వానంద్(sharwanand)మంచి జోరు మీద ఉన్నాడు. హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల(Srinu Vaitla) కాంబోలో ఒక మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ, టాలీవుడ్ లక్కీ చార్మ్ ఆషికా రంగనాథ్(Ashika ranganath)ఎంపికైనట్లు తెలుస్తోంది.

దర్శక నిర్మాతలు ఈ చిత్రంలో హీరోయిన్ క్యారక్టర్  కోసం చాలా మంది హీరోయిన్స్ ని  పరిశీలించినప్పటికీ, చివరికి ఆషికా రంగనాథ్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఆషికా క్యారక్టర్ ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుందని, కథను మలుపు తిప్పే కీలకమైన ఎమోషన్స్ ఆమె  చుట్టూనే తిరుగుతాయని టాక్ వినిపిస్తోంది. దాదాపుగా 100 శాతం వినోదం, విలక్షణమైన ప్రేమకథ నేపథ్యంలో సాగడంతో పాటు శర్వానంద్, ఆషికా రంగనాథ్ మధ్య వచ్చే లవ్ ట్రాక్,  కెమిస్ట్రీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.ఆషికాకి సంబంధించి  త్వరలోనే  అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం


ఇక ఈ సినిమా బడ్జెట్ మరియు టెక్నికల్ వాల్యూస్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. దాదాపు 30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. శర్వానంద్ గత చిత్రాల మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, బిజినెస్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ చాలా సేఫ్ జోన్‌లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఆషికా  ఈ సంక్రాంతికి రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తితో  మెప్పించడంతో పాటు మెగాస్టార్ విశ్వంభరలో కనువిందుచేయనున్న విషయం తెలిసిందే.

    

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com