Home

»

Latest News

NBK 112: బాలయ్య-కొరటాల మూవీ ముహూర్తం ఫిక్స్.. ఇక ఊచకోతే!

May 25, 2026 3:54PM

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 112' ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా విడుదలైన అధికారిక పోస్టర్‌తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిన ఈ చిత్రం, త్వరలోనే ఘనంగా ప్రారంభం కానుంది. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ యొక్క ముహూర్తపు వేడుకను జూన్ 25న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. 

ముహూర్తం పూర్తయిన తర్వాత, కేవలం కొన్ని రోజుల్లోనే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి, ఆగస్ట్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు కొరటాల శివ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు.

ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ఉన్న “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే ట్యాగ్‌లైన్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఒక బలమైన సామాజిక ఇతివృత్తాన్ని కమర్షియల్ హంగులతో జోడించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఈసారి కూడా బాలయ్య ఇమేజ్‌కు సరిపోయేలా, సమాజంలో ఉండే ఒక పవర్‌ఫుల్ పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ ఈ స్క్రిప్ట్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను కూడా బాలకృష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త మేకోవర్‌తో, మునుపెన్నడూ చూడని అత్యంత శక్తిమంతమైన మాస్ అవతారంలో కనిపించనున్నారని ఇండస్ట్రీ టాక్.

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాలో నటిస్తున్నారు. దానితో పాటు పారలాల్ గా కొరటాల శివ ప్రాజెక్ట్‌ షూటింగ్ లో పాల్గొననున్నారు. 

SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక నిపుణుల సమాచారం జూన్ 25న జరిగే లాంచింగ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

బాలయ్య మార్క్ ఊరమాస్ యాక్షన్, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ కలసి రాబోతున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com