Home

»

Latest News

Mouni roy: నెట్టింట వైరల్ అవుతున్న మౌని రాయ్ గ్లామర్ పిక్స్.. విడాకుల దారి విడాకులదే 

May 25, 2026 4:20PM

 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అప్ కమింగ్ మూవీ విశ్వంభర ఫేమ్ మౌని రాయ్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన అద్భుతమైన గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ సుందరి, ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోలు, గ్లామరస్ లుక్స్‌nin అభిమానులతో పంచుకుంటూ నెట్టింట  యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది.అందుకే  రోజురోజుకి ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. తన ఫిట్‌నెస్‌ను ఎంతో అద్భుతంగా మెయింటైన్ చేస్తూ, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్న మౌని రాయ్ తాజాగా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని సూపర్ కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫోటోలని  అభిమానులతో పంచుకుంది. ఈ తాజా ఫోటోలలో మౌని రాయ్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ (తెలుపు, ఆకాశం రంగు) లో ఉన్న ఒక ట్రెండీ అవుట్‌ఫిట్‌తో మెరిసిపోయింది. ఈ వెరైటీ వెస్ట్రన్ డ్రెస్‌లో ఆమె ఇచ్చిన విభిన్నమైన స్టైలిష్ పోజులు అభిమానులని ఎంతగానో మెస్మరైజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోషూట్ కోసం ఆమె తన కురులను ఎంతో అందంగా ముడి వేసుకుని, అల్ట్రా స్టైలిష్ హెయిర్ స్టైల్‌లో కనిపించడం విశేషం. ఆమె కళ్లలోని తీక్షణత, ముఖంలో ఉన్న గ్లామర్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మొత్తంగా మౌని రాయ్ లేటెస్ట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ అన్ని సాషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో వైరల్‌గా మారుతోంది.


Also read: Allu Arjun: వైరల్ గా మారిన అల్లు అర్జున్ వాచీ రేట్.. ఆ రేటుతో హైదరాబాద్ లో  ఏం కొనచ్చో తెలుసా!


'నాగిని' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న మౌని రాయ్, ఆ తర్వాత వెండితెరపై కూడా తన ముద్ర వేసింది. ముఖ్యంగా 2022లో వచ్చిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఆమె పోషించిన నెగెటివ్ రోల్ విమర్శకుల నుంచి  ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు గానూ ఐఫా (IIFA) అవార్డుల్లో ఉత్తమ సహాయ నటి అవార్డును కూడా గెలుచుకుంది. రీసెంట్‌గా జరిగిన ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) లో కూడా ఆమె తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. విశ్వంభర లో స్పెషల్ సాంగ్ చేసిన మౌని రాయ్ తన భర్త రాహుల్ నంబియార్ నుంచి విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com