సెట్స్ మీదకు అల్లరి నరేశ్ 'ఉగ్రం'
on Sep 5, 2022

అల్లరి నరేశ్ హీరోగా విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ 'నాంది' బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అమితంగా పొందింది. ఇప్పుడు వారి కలయికలో రెండో సినిమా 'ఉగ్రం' రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో నరేశ్ ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు.
'ఉగ్రం' రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఓ గ్లింప్స్ వీడియోతో ప్రకటించారు. ముఖానికి పులిమిన నల్లటి రంగుతో ఉన్న నరేశ్.. క్లోజప్ షాట్‌లో కళ్లని అటు ఇటు తిప్పి దేనికోసమో వెతుకుతూ, ఒక చోట చూపు నిలిపగానే, కళ్లు ఎర్రగా మారిపోయాయి. టైటిల్‌కు న్యాయం చేకూర్చేలో టెర్రిఫిక్‌గా ఉన్న గ్లింప్స్‌లో వినిపించిన నేపథ్య సంగీతం కూడా ఎమోషన్‌ను మరింత ఎలివేట్ చేసింది.
కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడక్షన్ నంబర్ 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో మిర్నా కథానాయికగా నటిస్తోంది. కొంతమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. 'నాంది' చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీం దాదాపుగా 'ఉగ్రం'లో భాగమయ్యారు.
తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



