మహేష్ హ్యాండ్ కృతి శెట్టికి కలిసొచ్చేనా?
on Sep 5, 2022

సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. సెప్టెంబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని ప్రశంసించిన ఆయన.. మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందులో సుధీర్ ఫిల్మ్ డైరెక్టర్ గా కనిపిస్తుండగా.. కృతి డాక్టర్ అలేఖ్య పాత్రలో కనిపిస్తోంది. సుధీర్ డైరెక్ట్ చేసే ఓ సినిమాలో ఆమె యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది. అయితే ఆ విషయం ఆమె పేరెంట్స్ కి తెలిసి ఒప్పుకోరు. దీంతో కృతి, సుధీర్ ఏం చేశారు? తండ్రి చనిపోతానని బెదిరించినా కృతి సినిమాలో నటించడానికి సిద్ధమవడానికి కారణమేంటి? వంటి అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

ట్రైలర్ ని బట్టి ఇదొక ఎమోషనల్ జర్నీ అనిపిస్తోంది. సినిమాకి, పేరెంట్స్ కి మధ్య నలిగిపోయే పాత్రలో కృతి కనిపిస్తోంది. హీరోయిన్ గా మొదటి మూడు సినిమాలు 'ఉప్పెన', 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు'తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి.. ఈ ఏడాది 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం'తో వరుసగా రెండు పరాజయాలు చూసింది. మరి ఈ చిత్రంతో హ్యాట్రిక్ ప్లాప్స్ ని తప్పించుకుంటుందేమో చూడాలి. ట్రైలర్ లో మాత్రం హిట్ కళ కనిపిస్తోంది.
బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వివేక్ సాగర్, సినిమాటోగ్రాఫర్ పీజీ విందా, ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ వ్యవహరిస్తున్నారు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



