తమన్ నామస్మరణలో అక్కినేని హీరోలు!
on Apr 13, 2021
.jpg)
ప్రస్తుతం తెలుగునాట నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు తమన్. 'క్రాక్', 'వకీల్ సాబ్' ఘనవిజయాలతో ఈ ఏడాది మరోమారు సెన్సేషన్ క్రియేట్ చేశాడీ యువ సంగీత సంచలనం. అలాగే ఇప్పుడు తమన్ చేతిలో 'లూసీఫర్' రీమేక్, 'అఖండ', 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్, 'సర్కారు వారి పాట'.. ఇలా పలు బిగ్ టికెట్ ఫిల్మ్స్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం తమన్ కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే.. అక్కినేని కుటుంబానికి చెందిన కథానాయకులందరితోనూ ఈ క్యాలెండర్ ఇయర్ లో తమన్ సినిమాలున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల జనం ముందుకొచ్చిన కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్'కి తమన్ నేపథ్య సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సంవత్సరం విడుదల కానున్న యువ సామ్రాట్ నాగచైతన్య 'థాంక్ యూ' చిత్రానికీ తమన్ నే స్వరకర్త. అలాగే.. ఏడాది చివరలో అంటే డిసెంబర్ 24న రిలీజ్ కానున్న అఖిల్ 'ఏజెంట్'కి కూడా తమన్ బాణీలు అందిస్తున్నాడు.
మొత్తమ్మీద.. అక్కినేని హీరోలంతా ఈ క్యాలెండర్ ఇయర్ లో తమన్ నామస్మరణ చేస్తున్నారన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



