అఖిల్ కాదు.. 'ఏజెంట్'
on Apr 8, 2021
అఖిల్ అక్కినేని హీరోగా నటించే 5వ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8 అఖిల్ బర్త్‌డే సంందర్భంగా ఆ సినిమా టైటిల్‌తో పాటు, అఖిల్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. సినిమాకి 'ఏజెంట్' అనే టైటిల్ ఖాయం చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే.. ఇప్పటిదాకా కనిపించని పెంచిన గడ్డం, జుట్టుతో కొత్తగా కనిపిస్తున్నాడు అఖిల్. నోటిలోంచి పొగ వస్తుంటే, చేతిలో సిగరెట్ కనిపిస్తోంది. అతని బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్‌గా ఉంది. టైటిల్ డిజైన్ ఆకట్టుకుంటుండగా, అఖిల్ లుక్ ఉత్తేజభరితంగా ఉంది. అఖిల్‌ను ఈ సినిమాతో సరికొత్తగా ప్రెజెంట్ చేయడానికి సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నాడు. ఆయనకు కూడా ఇది డిఫరెంట్ ఫిల్మ్‌గానే కనిపిస్తోంది.
వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్న 'ఏజెంట్' మూవీని అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సొంత బ్యానర్ సురేందర్ 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సురేందర్ రెడ్డి-వక్కంతం వంశీ కాంబినేషన్ ఇదివరకు 'కిక్', 'రేసుగుర్రం' లాంటి సూపర్ హిట్ మూవీస్‌ను అందించింది. 'ఏజెంట్'తో మరో సూపర్ హిట్‌ను సాధించాలని వారు తహతహలాడుతున్నారు.
'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాల్లో లవర్ బాయ్ లుక్‌లో కనిపించిన, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అదే లుక్‌లో కనిపిస్తోన్న అఖిల్ 'ఏజెంట్'లో మాచో మ్యాన్‌గా కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇంతదాకా కనిపించని స్టైలిష్ అవతారంలో అతడిని చూపించనున్న సురేందర్ రెడ్డికే ఈ క్రెడిట్ దక్కుతుంది.
స్పై థ్రిల్లర్‌గా రూపొందే ఈ మూవీలో అఖిల్ జోడీగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, రాగుల్ హెరియన్ ధరుమన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ కాగా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, పత్తి దీపారెడ్డి సహ నిర్మాతలు.
ఏప్రిల్ 11 నుంచి 'ఏజెంట్' రెగ్యులర్ షూట్ జరగనున్నది. ఈ ఏడాది డిసెంబర్ 24న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
Also Read