అక్టోబర్ లో `అఖండ` ఆగమనం!
on Jul 28, 2021
ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేయగల నటుల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. త్వరలో ఈ సీనియర్ స్టార్ అఘోరా పాత్రలో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. `అఖండ` పేరుతో తెరకెక్కుతున్న ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాని మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, తొలుత ఈ చిత్రాన్ని యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా వాయిదా పడింది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విజయదశమి కానుకగా అక్టోబర్ ప్రథమార్ధంలో `అఖండ`ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. దసరా బరిలో సరదాలు పంచనున్న బాలయ్యకి `అఖండ` ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
`అఖండ`లో బాలయ్యకి జంటగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటిస్తుండగా.. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.