`ఆచార్య`.. సోనూ సూద్ ఫస్ట్ లుక్ కి వేళాయే!
on Jul 28, 2021
మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటించిన `హేండ్సప్` (2000) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సోనూ సూద్. ఆపై పలు తెలుగు సినిమాల్లో సందడి చేసినప్పటికీ.. మళ్ళీ చిరుతో జట్టుకట్టనేలేదు. కట్ చేస్తే.. 21 ఏళ్ళ తరువాత `ఆచార్య`లో మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కింది సోనూ సూద్ కి. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమాలో సోనూ సూద్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. సోనూ సూద్ 48వ పుట్టినరోజు సందర్భంగా జూలై 30న `ఆచార్య`లో ఈ `రియల్ హీరో` పోషించిన పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారట. అంతేకాదు.. ఇదే పోస్టర్ లో పాత్ర పేరు కూడా రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే జూలై 30 వరకు వేచిచూడాల్సిందే.
కాగా, కరోనా కష్ట కాలంలో ఆపద్బాంధవుడుగా నిలిచిన సోనూసూద్.. `రియల్ హీరో`గా మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన `ఆచార్య`తో పాటు హిందీ చిత్రం `పృథ్వీరాజ్`, తమిళ సినిమా `తమిళరసన్` చేస్తున్నారు.
Also Read