ప్రభాస్ 'స్పిరిట్'లో ఆ ఫ్లాప్ తెలుగు హీరో..!
on Nov 11, 2025

ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన 'బాహుబలి' సినిమాలో ఆయనను ఢీ కొట్టే పాత్రలో దగ్గుబాటి హీరో రానా నటించాడు. ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'స్పిరిట్'లో కూడా ఆయనను ఢీ కొట్టే పాత్రలో మరో దగ్గుబాటి హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' చేయనున్నాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇటీవల విడుదలైన సౌండ్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
'స్పిరిట్'లో త్రిప్తి డిమ్రీ, వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో కీలక పాత్ర కోసం దగ్గుబాటి అభిరామ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: అసలు రవితేజ ఎలాంటి సినిమాలు చేయాలి..?
తేజ డైరెక్షన్ లో వచ్చిన 'అహింస'తో రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు అభిరామ్. 'అహింస' వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంతవరకు ఆయన కొత్త సినిమా అప్డేట్ రాలేదు. ఇలాంటి తరుణంలో 'స్పిరిట్'లో నటించే అవకాశం దక్కించుకున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
అణువణువునా అహంకారం నిండి ఉండే ఓ పవర్ ఫుల్ కోసం అభిరామ్ ని సందీప్ రెడ్డి సంప్రదించాడట. అభిరామ్ ఎపిసోడ్ 'స్పిరిట్' మూవీ మేజర్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
సందీప్ రెడ్డి సినిమాల్లో పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో తెలిసిందే. యాక్టర్స్ లైఫ్ టర్న్ అయ్యేలా రోల్స్ ని డిజైన్ చేయడంలో సందీప్ దిట్ట. ఇప్పుడు 'స్పిరిట్'తో అభిరామ్ కి కూడా యాక్టర్ గా మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



