'అఖండ-2'ని చూసి మిగతా వారు నేర్చుకోవాలి!
on Dec 2, 2025

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ-2' మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తరువాత ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమనే అంచనాలున్నాయి. అయితే విడుదలకు ముందే 'అఖండ-2' టీమ్ ఒక విషయంలో ప్రశంసలు అందుకుంటోంది. (Akhanda 2 Thaandavam)
తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్, అందునా యూఎస్ మార్కెట్ కీలకం. అక్కడ ముందు రోజు ప్రీమియర్స్ పడుతుంటాయి. అయితే మెజారిటీ భారీ సినిమాలు టైంకి కంటెంట్ డెలివరీ చేయలేకపోతున్నాయి. దీంతో కొన్ని షోలు క్యాన్సిల్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇటీవల పలు సినిమాలకు ఈ పరిస్థితి ఎదురైంది. ఇలాంటి టైంలో ప్రీమియర్స్ కి మూడు నాలుగు రోజుల ముందే కంటెంట్ డెలివరీ చేసి.. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఖుషీ చేసింది 'అఖండ-2' టీమ్.
Also Read: 'అఖండ-2'లో శివుడి పాత్రలో ఎన్టీఆర్!
చివరి నిమిషంలో హడావుడిగా కంటెంట్ పంపి, డిస్ట్రిబ్యూటర్స్ ని ఇబ్బంది పెట్టకుండా.. ముందే కంటెంట్ పంపిన 'అఖండ-2' టీమ్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిగతా వారు కూడా అఖండను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. కాగా, డిసెంబర్ 4న ప్రీమియర్స్ తో అఖండ తాండవం మొదలుకానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



