ఏపీలో 'అఖండ-2' ప్రీమియర్ షోలు, టికెట్ హైక్.. ఒక్కో టికెట్ ఎంతంటే..?
on Dec 2, 2025

'అఖండ-2' మూవీ టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే అఖండ తాండవం మొదలు కానుంది. ప్రీమియర్ షోలకు, టికెట్ ధరల పెంపుకి ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. (Akhanda 2 Thaandavam)
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 14 రీల్స్ ప్లస్ నిర్మించిన 'అఖండ-2' డిసెంబర్ 5న విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్స్ కి ప్రభుత్వం నుండి అనుమతి కూడా లభించింది. డిసెంబర్ 4న రాత్రి 8 నుండి 10 గంటల ప్రాంతంలో షోలకు పర్మిషన్ ఇచ్చారు. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు.
ప్రీమియర్ షోలతో పాటు పదిరోజుల పాటు టికెట్ ధరల పెంపుకి అనుమతి లభించింది. మల్టీప్లెక్స్ లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్ లో రూ.75 పెంపుకి పర్మిషన్ ఇచ్చారు.
Also Read: 'అఖండ-2'ని చూసి మిగతా వారు నేర్చుకోవాలి!
కోవిడ్ పాండమిక్ సమయంలో తక్కువ టికెట్ ధరలతోనే 'అఖండ' బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న 'అఖండ-2'.. ప్రీమియర్స్, టికెట్ హైక్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిందోననే ఆసక్తి నెలకొంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



