పుష్ప నుండి ఆ సీన్ తొలగింపు.. స్టార్ హీరో అయ్యుండి!
on Dec 20, 2021

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'పుష్ప ది రైజ్'. డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా బన్నీ నటన ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించేలా చేస్తుంది అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అసభ్యకర సన్నివేశాన్ని తొలగించడం విశేషం.
సుకుమార్ 'పుష్ప'ను రా సినిమాగా తెరకెక్కించారు. బన్నీ, రష్మిక సహా అందరినీ డీగ్లామర్ రోల్స్ లో చూపించారు. సన్నివేశాలు కూడా చాలా సహజంగా ఉండేలా చూసుకున్నారు. అయితే బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడేలా చేశాయి. ముఖ్యంగా రష్మిక ఎద భాగాన్ని బన్నీ టచ్ చేసే సన్నివేశం మరీ ఎబ్బెట్టుగా, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బందికరంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కలిసి చేసిన పాన్ ఇండియా మూవీలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం ఏంటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పుష్ప సినిమా నుంచి ఈ సన్నివేశాన్ని తొలగించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సన్నివేశాన్ని తొలగించినట్లు తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'పుష్ప: ది రైజ్'లో ఫహాద్ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సమంత 'ఊ అంటావా మావ' అంటూ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



