'పుష్ప' తర్వాత సెకండ్ ప్లేస్‌లో 'ఏకమ్'!
on Jan 22, 2022
ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఒక చిన్న సినిమా విశేషంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఆ సినిమా.. 'ఏకమ్'. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ల భరణి, అదితి మ్యాకల్, కల్పికా గణేశ్, దయానంద్‌రెడ్డి ప్రధాన పాత్రధారులైన ఈ మూవీతో వరుణ్ వంశీ బి. దర్శకునిగా పరిచయమయ్యాడు. ఎస్.ఎమ్.ఎస్. క్రియేషన్స్ బ్యానర్‌పై ఎ. కల్యాణ్ శాస్త్రి, పూజ ఎమ్., శ్రీరామ్ కె. ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు సినిమాలకు సంబంధించిన అమెజాన్ ప్రైమ్‌లో అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, 'ఏకమ్' సెకండ్ ప్లేస్‌లో నిలవడం విశేషం. దీంతో ఆ సినిమా యూనిట్ ఆనందం అంతా ఇంతా కాదు.
అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన "ఏకమ్" కేవలం పదిహేను రోజుల్లో టాప్-2కి చేరి... మొదటి స్థానం కోసం "పుష్ప"తో పోటీ పడుతోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా... తాత్విక చింతనకు ఆధునికతను జోడించి తెరకెక్కిన "ఏకమ్" చిత్రానికి అమెజాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారనుకోవాలి.
Also read: రాజశేఖర్ `ఓంకారం`కి పాతికేళ్ళు!
అమెజాన్ ప్రైమ్‌లో తమ సినిమాకు విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ... "ఏకమ్" చిత్రానికి అమెజాన్ లో రెండో స్థానం దక్కడం కలలా ఉంది... చాలా గర్వంగానూ ఉంది. ఇంతవరకు తెలుగులో రాని యూనీక్ జోనర్ లో రూపొందిన "ఏకమ్" చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా వస్తుండడం మరీ సంతోషంగా ఉంది" అన్నారు.
Also read: 'శ్రీమంతుడు' విలన్ రెండో పెళ్లి!
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఇక్బాల్ అజ్మీ, మ్యూజిక్: జోస్ ఫ్రాంక్లిన్, ఎడిటర్: శ్రీనివాస్ తోట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్, సమర్పణ: బోయపాటి రఘు, నిర్మాతలు: ఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎమ్., శ్రీరామ్ కె., కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వరుణ్ వంశీ బి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
