అందుకే ఆయన్ని వదిలేయాల్సి వచ్చింది
on Oct 27, 2022

యాక్ట్రెస్ ప్రగతి తెలుగు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . యాక్షన్, ఫిట్ నెస్ విషయంలో ఆమెకు ఎదురే లేదు. ఆమె ఫిట్ గా ఉండేందుకు గంటలు గంటలు జిమ్ లో వర్కవుట్లు చేస్తూ ఉంటుంది. ఆమెని చూసి చాలామంది ఆదర్శంగా తీసుకుంటూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కూడా. ఇన్స్టాగ్రామ్ పేజీల్లో ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ వీడియోలు, ఫ్యామిలీ ఫోటోస్, ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ షేర్ చేస్తూ తన ఫాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది ప్రగతి. ఐతే తాను ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు ప్రగతి. మూవీ ఇండస్ట్రీలో సింగల్ పేరెంట్ లా కుటుంబాన్ని నెట్టుకురావడం అనేది మామూలు విషయం కాదు. అయితే తాను తన భర్తను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో ప్రగతి చెప్పుకొచ్చింది.
" అమ్మ సింగిల్ గా ఉన్నారు కదా.. నేను అలా ఉండకూడదు, భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి బతికేద్దాం అన్నట్టుగానే ఉన్నా..చాలావరకు రాజీ పడుతూనే ఉన్నా..ఐతే ఒక టైంకి వచ్చేసరికి ఆ టార్చెర్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇక అతనితో నాకు సెట్ అవదు అని అర్ధమయ్యింది. సొసైటీ నా గురించి ఏమనుకుంటుందన్న విషయం పక్కన పెడితే.. పిల్లలకి ఏం చెప్తున్నాం అనేది ముఖ్యం" అని అన్నారు. ఇలా తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు ప్రగతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



