"రండి.. కూర్చోండి" అని చెప్పడానికి 16 టేకులు తీసుకుంది!
on Jan 21, 2021

దక్షిణాది చిత్రసీమలోని శృంగార తారల్లో ఒకరిగా అనూరాధ పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో క్లబ్ సాంగ్స్ లేదా ఐటమ్ సాంగ్స్‌కు సిల్మ్ స్మిత లేదా డిస్కో శాంతి లేదా అనూరాధల్లో ఎవరో ఒకరో, ఇద్దరో ఉండాల్సిందే. అనూరాధ డాన్సర్‌గా ఎంత ఫేమస్సో, వ్యాంప్ రోల్స్‌కూ ఫేమస్. కొంత కాలం క్రితం టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఐటమ్ గాళ్‌గా పేరు తెచ్చుకున్న అభినయశ్రీ ఆమె కూతురే.
కాగా ఓ సినిమాలో హీరోతో "రండి కూర్చోండి" అనే డైలాగ్ చెప్పడానికి అనూరాధ 16 టేకులు తీసుకున్నారంట. ఈ విషయం ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. 'అలీతో సరదాగా' షోలో మరో శృంగార తార షకీలతో కలిసి గెస్ట్‌గా వచ్చారు అనూరాధ. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో అనూరాధను అలీ, "జనరల్‌గా నేను మీ ఇంటికి వచ్చాననుకోండి.. ఏవంటారు మీరు?" అనడిగారు. "రా అలీ కూర్చో.. భోంచెయ్ అంటాను." అని ఆమె చెప్పారు.
"ఈ డైలాగ్ చెప్పడానికి మీరు 16 టేకులు తీసుకున్నారంట ఏంటి?" అని అలీ ప్రశ్నించారు. "అవును" అంటూ పైకీ కిందికీ తలాడించారు అనూరాధ. ఓ తమిళ సినిమాలో ఆ ఘటన చోటు చేసుకుందని ఆమె ఇచ్చిన ఆన్సర్‌ను బట్టి అర్థమవుతోంది. "హీరోగారు మా ఇంటికి వస్తున్నారు.. (ఆయనతో) వాంగ వాంగ ఉకారంగ అని డైలాగ్ చెప్పాలి. దానికి 16 టేకులు అయ్యింది. అందరూ బండబూతులు తిట్టారు." అంటూ నవ్వుతూ ఆనాటి ఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ ఈటీవీలో ఈ నెల 25న ప్రసారం కానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



