దుల్కర్‌తో హృతిక్ హీరోయిన్?
on Jan 21, 2021

బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చిన చిత్రాల్లో సూపర్ 30 ఒకటి. 2019లో విడుదలైన ఈ సినిమాలో అతనికి జోడీగా మృణాళ్ ఠాకూర్ నటించింది. ఇక ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న జెర్సీ హిందీ రీమేక్ లోనూ షాహిద్ కపూర్ కి జంటగా ఈ టాలెంటెడ్ బ్యూటీనే నటించింది. ఇంతవరకు హిందీ, మరాఠి భాషల్లో నాయికగా అలరించిన మృణాళ్.. త్వరలో ఓ తెలుగు చిత్రంలో సందడి చేయనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పిరియడ్ రొమాంటిక్ సాగాలో ఇద్దరు నాయికలకు స్థానముందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అందులో ఒకరిగా పూజా హెగ్డే ఎంపికయిందని ఇప్పటికే కథనాలు వచ్చాయి కూడా. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడు పూజకు బదులుగా మృణాళ్ నటించబోతోందట. కాల్షీట్ల సమస్య కారణంగా.. పూజ నో చెప్పడంతో మేకర్స్ దృష్టి మృణాళ్ పై పడిందని.. కథ, పాత్ర నచ్చడంతో మిస్ ఠాకూర్ కూడా వెంటనే ఓకే చెప్పిందని టాక్. త్వరలోనే దుల్కర్ - హను కాంబినేషన్ మూవీలో మృణాళ్ ఠాకూర్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



