క్యారెక్టర్ యాక్ట్రెస్ సూసైడ్
on Aug 7, 2020

ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఆత్మహత్యల పరంపర ఆగడం లేదు. బుధవారమే టీవీ ఆర్టిస్ట్ సమీర్‌శర్మ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, కాస్త ఆలస్యంగా మరో నటి ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. భోజ్‌పురి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న అనుపమ పాఠక్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. తను అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌లో ఆదివారం (ఆగస్ట్ 2) ఉరివేసుకుని ఉన్న ఆమెను కనుగొన్నారు.
అయితే ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు. అనుపమ వయసు 40 సంవత్సరాలు. భోజ్‌పురి సినిమాల ద్వారా ఆమె పాపులర్. పేరు పొందిన టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. అయితే కొంత కాలంగా ఎదురవుతున్న ఘటనల వల్ల ఆమె డిప్రెషన్‌కు గురయ్యారు. ముఖ్యంగా కరోనా కారణంగా పని లేకుండా పోవడం, ఆర్థిక సమస్యలతో ఆమె బాగా అప్‌సెట్ అయ్యారని చెబుతున్నారు.
మృతికి ముందు అనుపమ ఫేస్‌బుక్ లైవ్‌లో తన భావాలను పంచుకున్నారు. ఎవరినీ నమ్మవద్దని ఆమె తన స్నేహితులను, ఫాలోయర్స్‌ను కోరారు. తను మోసపోయాననీ, అందుకు తానెవరినీ నమ్మదలచుకోలేదనీ చెప్పారు. తమ సమస్యలను ఎవరితోనూ పంచుకోవద్దనీ, ఎవరినీ స్నేహితులుగా భావించవద్దనీ ఆమె సూచించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



