అపస్మారక స్థితిలో టాప్ కమెడియన్!
on Apr 16, 2021
.jpg)
సౌత్ ఇండియాలోని టాప్ కమెడియన్లలో ఒకరైన కోలీవుడ్ యాక్టర్ వివేక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఒంట్లో అసౌకర్యంగా ఉందంటూ శుక్రవారం ఆయన చెన్నైలోని స్విమ్స్ హాస్పిటల్‌లో చేరారు. ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉందని తెలిపారు. ఆయనకు ఈసీఎంఓ అమర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆకస్మికంగా దిగజారడం వెనుక కారణం తెలియాల్సి ఉంది.
వివేక్ అపస్మారక స్థితిలో ఉన్నారు. నాడి అందడం లేదు. ఆయనను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం అని డాక్టర్లు చెప్పారు. గురువారమే ప్రజారోగ్య సందేశాలకు సంబంధించి రాష్ట్ర అంబాసిడర్‌గా ఆయనను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ హాస్పిటల్‌లో కొవిడ్ వాక్సిన్ వేయించుకున్న వివేక్, ప్రజలందరూ ముందుకు వచ్చి వాక్సిన్ వేయించుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇంతలోనే ఆయనకు ఇలా అవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.
దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ ద్వారా నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన వివేక్, తర్వాత కాలంలో రన్, సామి, పేరళగన్, పార్తీబన్ కణవు, అన్నియన్, ధూల్, శివాజీ, సింగమ్, మాపిళ్లై, విశ్వాసమ్ లాంటి సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. వివేక్ వయసు 59 సంవత్సరాలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



